Appi Reddy: కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న తెలంగాణకు చెందిన సినీ నిర్మాత

  • హుజూర్ నగర్, కోదాడ స్థానాలకు దరఖాస్తు చేసుకున్న అప్పిరెడ్డి
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా అప్పిరెడ్డికి గుర్తింపు
  • తనకు అవకాశం వస్తే పోటీ చేస్తానన్న అప్పిరెడ్డి
Tollywood producer Appi Reddy applied for Congress ticket

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. బీఆర్ఎస్ పార్టీ అప్పుడే 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న వారు పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎంతటి నేతలైనా దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ దక్కుతుందనే కండిషన్ ను పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ రంగం నుంచి తెలంగాణకు చెందిన నిర్మాత అప్పిరెడ్డి కూడా పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా అప్పిరెడ్డికి పేరుంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు దరఖాస్తు చేసుకున్న రెండు స్థానాలకు (హుజూర్ నగర్, కోదాడ) ఈయన అప్లై చేయడం గమనార్హం. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ఇస్తానని గతంలో ఉత్తమ్ తనకు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా అప్పిరెడ్డి చెప్పారు. తనకు అవకాశం వస్తే పోటీ చేస్తానని, ఉత్తమ్ దంపతులే పోటీ చేసినా తనకు అసంతృప్తి ఉండదని తెలిపారు. సినిమాల విషయానికి వస్తే జార్జిరెడ్డి, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News