Allu Arjun: ఈ గుర్తింపును అందుకు ఉపయోగించండి: అల్లు అర్జున్ సహా అందరికీ విజయసాయిరెడ్డి సూచన!

Big win for Telugu cinema at the 69th National Film Awards says vijayasaireddy
  • ఈ అవార్డు పొందిన తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ అంటూ ట్వీట్
  • తెలుగు పరిశ్రమకు 10 అవార్డులు రావడంపై విజయసాయి హర్షం
  • అవార్డు గెలుచుకున్నవారికి అభినందనలు తెలిపిన వైసీపీ ఎంపీ
జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమకు పది అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. జాతీయస్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమాకు అభినందనలు, జాతీయ ఉత్తమనటుడు అవార్డు పొందిన తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్, ఉత్తమ  పాపులర్ మూవీ ఆర్ఆర్ఆర్, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి, రచయిత చంద్రబోస్, గాయకులు కాలభైరవ, ప్రేమ్ రక్షిత్‌కు ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ ఫోటోను ట్వీట్‌లో జత చేశారు.

ఇంగ్లీష్‌లో మరో ట్వీట్ చేశారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు పరిశ్రమ సత్తా చాటిందని, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అద్భుత నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు నుండి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు... తెలుగు పరిశ్రమకు పది అవార్డులు వచ్చాయని, వీరంతా మనకు గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు పరిశ్రమను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లేందుకు ఈ గుర్తింపును వారు ఉపయోగిస్తారని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Allu Arjun
Vijayasai Reddy
YSRCP
Tollywood

More Telugu News