Krishna Express: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. తప్పిన ప్రమాదం

Smoke In Tirupati Adilabad Krishna Express Near Venkatagiri station
  • ఏపీలోని వెంకటగిరి స్టేషన్ సమీపంలో ఏసీ కోచ్ ను కమ్మేసిన పొగ
  • చైన్ లాగి రైలును నిలిపేసిన ప్రయాణికులు
  • బ్రేకులు పట్టేయడంతోనే పొగలు వచ్చాయన్న అధికారులు
తిరుపతి, ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలులోని ఏసీ బోగీలో శుక్రవారం పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలు సికింద్రాబాద్ వెళుతుండగా ఏపీలోని వెంకటగిరి స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది. మరమ్మతులు పూర్తిచేశాక తిరిగి బయలుదేరింది.

కృష్ణా ఎక్స్ ప్రెస్ శుక్రవారం తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరింది. వెంకటగిరి స్టేషన్ సమీపంలో ఏసీ బోగీలో పొగలు రావడం ప్రయాణికులు గుర్తించారు. దీంతో చైన్ లాగి రైలును ఆపారు. బోగీ వద్దకు చేరుకున్న రైల్వే సిబ్బంది.. పొగ ఎక్కడి నుంచి వస్తుందని పరిశీలించారు. ఏసీ కోచ్ బోగీ బ్రేకులు పట్టేయడం వల్లే పొగలు వచ్చాయని గుర్తించారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు పూర్తిచేశాక తిరిగి బయలుదేరింది. ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.
Krishna Express
accident was averted
Smoke in Ac coach
Train fire
Andhra Pradesh
Indian Railways

More Telugu News