Team India: యోయో స్కోరులో ముందున్న విరాట్ కోహ్లి!

  • బెంగళూరులో ఎన్సీఏలో భారత జట్టుకు ఫిట్ నెస్ క్యాంప్
  • యోయో టెస్టుకు హాజరైన కోహ్లీ, రోహిత్, పాండ్యా
  •  17.2 స్కోరు సాధించిన కోహ్లి  
  • కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ పై అందరి ఫోకస్
Virat kohli scores highest score on yo yo test

ఆసియా కప్‌ ముంగిట భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆరు రోజుల ఫిట్‌నెస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టు సభ్యులు ఎన్సీఏ చేరుకొని చెమటలు చిందిస్తున్నారు. పలువురు క్రికెటర్లు ఫిట్‌నెస్‌ డ్రిల్స్‌ తో పాటు యోయో టెస్టులో పాల్గొన్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చే స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ అందరికంటే ఎక్కువగా 17.2 స్కోరు సాధించాడు. ఈ విషయాన్ని అతను సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు. యోయో టెస్టులో బీసీసీఐ 16.5 స్కోరును ప్రామాణికంగా నిర్దేశించింది. 

16.5 స్కోరు దాటితేనే ఫిట్ నెస్ టెస్టులో పాసైనట్టు లెక్క. కోహ్లీ అలవోకగా 17 పైచిలుకు స్కోరు సాధించి తన తోటి ఆటగాళ్లకు సవాల్ విరుసుతున్నాడు. కోహ్లీతో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వన్డే వైస్‌ కెప్టెన్‌ కూడా ఈ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కానీ, వాళ్ల స్కోర్లను ఎన్సీఏ బయటపెట్టలేదు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ డ్రిల్స్‌ లో పాల్గొన్నప్పటికీ అతడిని ఇంకా యోయో టెస్టు జాబితాలో చేర్చలేదు. దాంతో, అతని ఫిట్ నెస్ పై అందరి ఫోకస్ ఉంది.

More Telugu News