Allu Arjun: అల్లు అర్జున్ బావా, కంగ్రాట్స్... అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

JR NTR congratulates Allu Arjun
  • జాతీయ ఉత్తమ నటుడి అవార్డు నేపథ్యంలో అల్లు అర్జున్‌కు అభినందనల వెల్లువ
  • అభినందనలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
  • పుష్ప సినిమాలో నటనకు ఈ అవార్డుకు అర్హుడివంటూ కితాబు
పుష్ప సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. అవార్డు నేపథ్యంలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో అల్లు అర్జున్ ట్రెండింగ్‌లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందినవారు అభినందనలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సహ నటుడికి శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అర్జున్ బావా.. కంగ్రాచ్యులేషన్స్, పుష్ప సినిమాకు గాను ఈ అవార్డుకు నీవు అర్హుడివి అంటూ ట్వీట్ చేశారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ఉప్పెన టీమ్‌కు, ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న అలియాభట్‌కూ తారక్ అభినందనలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆరు జాతీయ అవార్డులు దక్కించుకుంది. అవార్డులు దక్కించుకున్న వారితో పాటు సినిమా బృందానికి కూడా ఆయన అభినందనలు తెలిపారు.
Allu Arjun
Jr NTR
Tollywood

More Telugu News