Google: ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోజుకు గంట మాత్రమే పనిచేస్తాడు... జీతం ఎంతో తెలుసా...?

  • గూగుల్ లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న డెవోన్
  • రోజుకు గంటపాటు వర్క్ ఫ్రం హోం పద్ధతిలో విధి నిర్వహణ
  • ఏడాదికి రూ.1.2 కోట్ల వేతనం ఇస్తున్న గూగుల్
  • ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన ఉద్యోగి
Software engineer works only one hour per day and get huge amount for that

సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు కొన్ని ప్రముఖ కంపెనీల్లో భారీ వేతనాలు ఉంటాయి. గూగుల్ వంటి టెక్ దిగ్గజాలయితే కళ్లు చెదిరే ప్యాకేజీలు ఇస్తుంటాయి. అయితే రోజుకు కనీసం 8 గంటల పని అనే చాలా ముఖ్యం. కానీ, ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. 

డెవోన్ (పేరు మార్చడం జరిగింది) గూగుల్ లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నాడు. విశేషం ఏంటంటే అతడు రోజుకు ఒక గంట మాత్రమే గూగుల్ కోసం పనిచేస్తాడు. మిగతా సమయం అంతా తన సొంత స్టార్టప్ కోసం వెచ్చిస్తాడు. ఇక రోజుకు గంట చొప్పున చేసే ఆ ఉద్యోగానికి గాను డెవోన్ అందుకునే జీతం ఎంతో తెలుసా... సంవత్సరానికి అక్షరాలా రూ.1.2 కోట్లు! 

ఎంతో చురుకైన ఉద్యోగిగా గుర్తింపు పొందిన అతడు పనిచేసేది రోజుకు గంటే అయినా, చేసినంతలో అత్యంత నాణ్యమైన పనితీరు కనబర్చేవాడు. గూగుల్ నుంచి అతడు మెరుగైన వేతనం అందుకోవడానికి కారణం ఇదే. ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే అతడు గూగుల్ లోనే ఇంటర్న్ షిప్ చేశాడు. అప్పట్లో అప్రెంటిస్ గా ఉన్నప్పుడే రోజుకు రెండు గంటలు పనిచేసేవాడు. అతడు ఎంత ప్రతిభావంతుడు అంటే... అతడికి అప్పగించిన కోడింగ్ పనిని ఇంటర్న్ షిప్ లో చేరిన మొదట్లోనే పూర్తిచేశాడట. 

ఇంతజేసీ మనవాడు ఆఫీసుకు కూడా రాడు. ఇంటివద్ద నుంచే పనిచేస్తాడు. దానిపై డెవోన్ ఫార్చ్యూన్ పత్రికతో మాట్లాడుతూ, తన మేనేజర్ చాలా మంచివాడని, ఆఫీసుకు రాకపోయినా ఏమీ అనడని సంతోషంగా చెప్పాడు. 

సాధారణంగా వారంలో కొన్నిరోజుల పాటు ఆఫీసుకు తప్పనిసరిగా రావాలని గూగుల్ తన ఉద్యోగులకు నిబంధన విధించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం మేనేజర్లకు అప్పగించింది. మేనేజర్ల పని సరైన ఉత్పాదకత రాబట్టడమే. డెవోన్ వంటి ఉద్యోగులు నాణ్యమైన పనితీరు కనబరుస్తుంటే, వారు ఎక్కడ్నించి పనిచేశారన్నది మేనేజర్లకు పెద్ద పట్టింపు కాబోదు. 

ఈ నేపథ్యంలో, ఒకవేళ గూగుల్ నుంచి ఏమైనా హెచ్చరిక వస్తే తప్ప తాను ఇంటి నుంచే పనిచేస్తానని డెవోన్ చెబుతున్నాడు.

More Telugu News