Praggnanandhaa: ఫిడే చెస్ ప్రపంచకప్ లో ప్రజ్ఞానందకు నిరాశ... విజేతగా నిలిచిన కార్ల్ సన్

Praggnanandhaa lost to Magnus Karlsen in FIDE World Cup final
  • అజర్ బైజాన్ లోని బాకులో ఫిడే వరల్డ్ కప్ పోటీలు
  • ఫైనల్లో మాగ్నస్ కార్ల్ సన్ × ప్రజ్ఞానంద
  • రెండు క్లాసికల్ గేమ్ లు డ్రా
  • ర్యాపిడ్ రౌండ్ కు దారితీసిన పోరు
  • తొలి గేమ్ లో గెలిచిన కార్ల్ సన్... టైటిల్ కైవసం
ఫిడే ప్రపంచకప్ ఫైనల్లో భారత సంచలన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ తో జరిగిన ఫైనల్ పోరులో 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు. 

అజర్ బైజాన్ లోని బాకు నగరంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతోంది. కార్ల్ సన్, ప్రజ్ఞానంద మధ్య ఫైనల్లో రెండు క్లాసికల్ గేమ్ లు డ్రాగా ముగియడంతో, టై బ్రేక్ లో భాగంగా ఇవాళ ర్యాపిడ్ రౌండ్ నిర్వహించారు. తొలిగేమ్ లో కార్ల్ సన్ గెలవగా, రెండో గేమ్ డ్రాగా ముగిసింది. 

రెండో గేమ్ లో ప్రజ్ఞానంద గెలిచి ఉంటే, ఈ పోరు బ్లిట్జ్ రౌండ్ కు దారితీసేది. కానీ, రెండో గేమ్ ను ప్రజ్ఞానంద డ్రా చేసుకోవడంతో కార్ల్ సన్ ప్రపంచకప్ విజేతగా అవతరించాడు. 

ఇప్పటికే ఐదు పర్యాయాలు వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ టైటిళ్లు సాధించిన 30 ఏళ్ల నార్వే గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ కు కెరీర్ లో ఇదే తొలి ఫిడే వరల్డ్ కప్ టైటిల్. అటు, గతంలో పలుమార్లు కార్ల్ సన్ ను ఆన్ లైన్ చెస్ లో ఓడించిన ప్రజ్ఞానంద... ప్రపంచకప్ సమరంలో ముఖాముఖి పోరులో ఓడించిలేకపోయాడు. తద్వారా, వరల్డ్ కప్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయాడు.
Praggnanandhaa
FIDE World Cup
Magnus Karlsen
Title

More Telugu News