Balakrishna: రిలీజ్ కి రెడీగా 'భగవంత్ కేసరి' నుంచి ఫస్టు సింగిల్!

  • 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ 
  • ఆయన సరసన నాయికగా కాజల్
  • కూతురు పాత్రలో కనిపించనున్న శ్రీలీల
  • ప్రత్యేక ఆకర్షణగా తమన్ సంగీతం 
  • అక్టోబర్ 19వ తేదీన సినిమా విడుదల  
Bhagavanth Kesari Movie Update

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా రూపొందింది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఇది బాలయ్య మార్కు సినిమాగానే ఉంటుందని అనిల్ రావిపూడి ముందుగానే హింట్ ఇచ్చేశాడు. ఆయన ఫస్టు లుక్ ను రివీల్ చేస్తూనే, సినిమాపై అంచనాలు పెంచేశాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. వినాయకుడి ఉత్సవాల సందర్భంలో వచ్చే పాటగా ఫస్టు సింగిల్ ఉండనుంది. బాలయ్య జోరుగా స్టెప్పులేస్తున్న పాట తాలూకు పోస్టర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. 

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో అర్జున్ రాంపాల్ .. ప్రియాంక జవాల్కర్ కనిపించనున్నారు. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 

More Telugu News