DK Aruna: డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

  • గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
  • అఫిడవిట్ లో తప్పుడు వివరాలను సమర్పించారని నిర్ధారణ
  • రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
TS High Court declares DK Aruna as MLA

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారనే కారణంగా డిస్ క్వాలిఫై చేసింది. ఎన్నికల ఫలితాలలో రెండో స్థానంలో ఉన్న బీజేపీ నాయకురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డికి రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో డీకే అరుణకు రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు తీర్పును కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు.

More Telugu News