Junior NTR: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ పిక్

Junior NTR and Mokshagna pic going viral
  • నందమూరి సుహాసిని కుమారుడి వివాహానికి హాజరైన కుటుంబ సభ్యులు
  • వేడుకను దగ్గరుండి చూసుకున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఎన్టీఆర్, మోక్షజ్ఞ
నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీనికి కారణం నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞలు ఒకే చోట కనిపించడం. నందమూరి సుహాసిని కుమారుడి వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. తమ సోదరి కుమారుడి పెళ్లి వేడుకను జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమయింది. నందమూరి సోదరులు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Junior NTR
Mokshagna
Tollywood
Nandamuri

More Telugu News