Praveen Sattaru: నా మాటలు ఉన్నంత పదునుగా సినిమాలు ఉండవంటే ఒప్పుకోను: ప్రవీణ్ సత్తారు

  • రేపు విడుదలకి రెడీగా 'గాండీవధారి అర్జున'
  • లండన్ నేపథ్యంలో కథ జరుగుతుందన్న ప్రవీణ్ సత్తారు 
  • వరుణ్ తేజ్ ఓ బాడీగార్డుగా కనిపిస్తాడని వెల్లడి 
  • తన విషయంలో ఆ విమర్శ సరైంది కాదని వ్యాఖ్య  
Praveen Sattaru Interview

ప్రవీణ్ సత్తారు ఎంచుకునే కథలు యాక్షన్ ప్రధానంగా సాగుతుంటాయి .. ఆయన మేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. ఆయనపై ఎక్కువగా హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉందేమోననే అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అలాంటి ప్రవీణ్ సత్తారు నుంచి 'గాండీవధారి అర్జున' సినిమా రూపొందింది. వరుణ్ తేజ్ హీరోగా నిర్మితమైన ఈ సినిమా, రేపు విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన విషయాలను 'గ్రేట్ ఆంధ్ర' ద్వారా ప్రవీణ్ సత్తారు పంచుకున్నారు. "ఇది లండన్ లో ఒక వారం రోజుల పరిథిలో జరిగే కథ. అక్కడ జరిగే ఒక సమ్మిట్ కి ఇండియా తరఫున నాజర్ హాజరవుతారు. ఆయన సెక్యూరిటీ కోసం ఒక ఏజన్సీ నుంచి ప్రైవేట్ బాడీగార్డుగా హీరోను పంపించడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందనేదే కథ" అని అన్నాడు. 

" ఇదంతా కూడా ప్రధానమైన కథాంశం .. ఆ తరువాత చాలా లేయర్స్ కనిపిస్తూ ఉంటాయి. సినిమాను ఎక్కడ తీశామనేది ఆడియన్స్ పట్టించుకోరు. కథను ఫాలో అవుతుంటారు .. ఎమోషన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. నేను యాక్షన్ సినిమాలు మాత్రమే చేయగలననేది నిజం కాదు .. వరుసగా యాక్షన్ సినిమాలు కుదిరాయంతే. ఆ మాటకొస్తే 'గరుడ వేగ' కంటే, 'గుంటూరు టాకీస్' పెద్ద హిట్. నా మాటలు ఉన్నంత పదునుగా సినిమాలు ఉండవనే కామెంట్స్ ను నేను ఒప్పుకోను" అంటూ సమాధానమిచ్చారు. 

More Telugu News