vijaya shanthi: కామారెడ్డిలో కేసీఆర్​పై పోటీ వార్తలపై స్పందించిన విజయశాంతి!

Party will decide my contest against KCR in Kamareddy says Vijayashanti
  • ఈ విషయం పార్టీనే నిర్ణయిస్తుందన్న బీజేపీ సీనియర్ లీడర్
  • మీడియాలో వస్తున్న వార్తలకు తన సమాధానం ఇంతేనని ట్వీట్
  • కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్ల బీజేపీ గెలుపు తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అని వ్యాఖ్య
సినీ నటి, బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై విజయశాంతిని బరిలోకి దింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్వయంగా విజయశాంతి స్పందించారు.  

‘కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.
vijaya shanthi
BJP
KCR
Kamareddy
Telangana Assembly Election

More Telugu News