Ramcharan: హైదరాబాద్​లో బిజీబిజీగా ‘గేమ్‌ ఛేంజర్​’ టీమ్

  • ఓ ప్రైవేట్ స్టూడియోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
  • చరణ్, కియారా ఫొటోలు ఆన్‌లైన్ లో ప్రత్యక్ష్యం
Game Changer movie shooting in hyderabad

ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ’గేమ్ ఛేంజర్’. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా స్థాయిలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇటీవలే సినిమా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ స్టూడియోలో చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. 

రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్‌, ఎస్‌. జే సూర్య, అంజలి, సునీల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమా నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. రామ్‌చరణ్‌, కియారాపై బీచ్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
.

More Telugu News