Vladimir Putin: చంద్రయాన్-3 సక్సెస్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందన

Russia President Putin praises India for Chandrayaan 3 success
  • అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత విజయాన్ని సాధించిందన్న పుతిన్
  • అంతరిక్ష అన్వేషణలో ఇదొక పెద్ద ముందడుగని కితాబు
  • మోదీకి, ఇస్రోకు అభినందనలు తెలిపిన రష్యా ప్రధాని
చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో భారత్ పై ప్రపంచ దేశాధినేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ.. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని కొనియాడారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగు పెట్టడం గొప్ప విషయమని ప్రశంసించారు. అంతరిక్ష రహస్యాల అన్వేషణలో ఇదొక అతి పెద్ద ముందడుగని ప్రశంసించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారత్ సాధించిన పురోగతికి ఇది నిదర్శనమని అన్నారు. తన మిత్రుడు ప్రధాని మోదీకి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నాయకత్వంకి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 

Vladimir Putin
Russia
Narendra Modi
BJP
Chandrayaan-3
ISRO

More Telugu News