Hyderabad: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్ జనరల్ మేనేజర్ హత్య

Hyderabad restaurant general manager shot dead by unidentified assailants
  • మదీనాగూడలోని సందర్శినీ ఎలైట్ రెస్టారెంట్ జనరల్ మేనేజర్ దేవేందర్‌ గాయన్‌పై కాల్పులు
  • దేశవాళీ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయిన ఆగంతుకులు
  • తీవ్ర రక్తస్రావమై ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోయిన బాధితుడు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
  • పాతకక్షలతోనే దేవేందర్‌ను హత్యచేసుంటారని పోలీసుల ప్రాథమిక అంచనా
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ‌లోగల సందర్శినీ ఎలైట్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా చేస్తున్న దేవేందర్ గాయన్‌పై (35) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దేశవాళీ తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో దేవేందర్‌కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. 

హత్యకు గల కారణాలు ఏమిటో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షలే దేవేందర్ హత్యకు దారి తీసి ఉంటాయని వారు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ రావు తెలిపారు.
Hyderabad
Telangana
Crime News

More Telugu News