Karthikeya: ఇంతవరకూ చేసిన సినిమాలు వేరు .. ఇది వేరు: 'బెదురులంక 2012' ఈవెంటులో కార్తికేయ

  • కార్తికేయ నుంచి 'బెదురులంక 2012'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదభరితమైన కథ
  • దర్శకుడిగా క్లాక్స్ పరిచయం 
  • ఈ సినిమాలో కొత్త కార్తికేయను చూస్తారన్న హీరో 
  • ఈ నెల 25న థియేటర్లకు వస్తున్న సినిమా
Bedurulanka Pre Release Event

కార్తికేయ హీరోగా 'బెదురులంక 2012' సినిమా రూపొందింది. రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకి, క్లాక్స్ దర్శకత్వం వహించాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా నేహా శెట్టి కనిపించనుంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. 

ఈ వేదికపై కార్తికేయ మాట్లాడుతూ .. "ఇంతవరకూ నేను చేసిన సినిమాలు వేరు .. ఈ సినిమా వేరు. 'RX 100' సినిమాతో నేను పరిచయమైనట్టుగా భావిస్తాను .. ఈ సినిమాతో మళ్లీ పరిచయమవుతున్నట్టుగా  అనిపించింది. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా చేసిన సినిమా ఇది. నేను ఈ కథను వింటూ ఎంజాయ్ చేశాను .. ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తారు" అని అన్నాడు. 

"ఈ సినిమాలో కొత్త కార్తికేయను చూస్తారు .. అందుకు కారకుడు క్లాక్స్ అని నేను బలంగా చెబుతాను. ఇక ఇంతవరకూ రాధిక పాత్రతో పాప్యులర్ అయిన నేహా., ఇకపై చిత్రగా కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని భావిస్తున్నాను. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అజిత్ ఘోష్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News