rajaiah: రాజయ్యను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా!

  • హన్మకొండలోని ఎమ్మెల్యే రాజయ్య నివాసానికి వెళ్లిన పల్లా
  • రాజయ్య ఇంటి వద్ద లేకపోవడంతో వెనుదిరిగిన ఎమ్మెల్సీ పల్లా
  • స్టేషన్ ఘన్‌పూర్ టిక్కెట్ దక్కలేదన్న బాధలో ఎమ్మెల్యే రాజయ్య!
Palla Rajeswar Reddy tries to meet MLA Rajaiah

బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కలిసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హన్మకొండలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద లేకపోవడంతో పల్లా వెనుదిరిగారు. ఇటీవల తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 115 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. ఏడు స్థానాలు మినహా మిగతా అన్నిచోట్లా సిట్టింగ్‌లకు అవకాశం దక్కింది.

అయితే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం టిక్కెట్ దక్కలేదు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి పార్టీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే రాజయ్య ఆవేదనకు లోనయ్యారు. అయినప్పటికీ తాను కేసీఆర్ గీసిన గీత దాటనని, ఆయన చెప్పినట్లు వింటానని అన్నారు. రాజయ్య నిన్న పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ భోరున విలపించారు. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం ఆయన వద్దకు పల్లాను పంపించింది.

మరోవైపు, పాలేరు టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న తుమ్మల నాగేశ్వర రావుకు కూడా టిక్కెట్ రాలేదు. దీంతో ఆయన వద్దకు ఎంపీ నామా నాగేశ్వరరావును పంపించారు. సీఎం ఆదేశాల మేరకు తుమ్మలతో చర్చించినట్లు నామా చెప్పారు.

More Telugu News