apple: ఛార్జింగ్​ విషయంలో ఐఫోన్​ యూజర్లకు యాపిల్​ కీలక హెచ్చరికలు

  • ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పక్కన నిద్రించవద్దని హెచ్చరించిన సంస్థ
  • దుప్పట్లు, దిండ్లపైనా ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ను ఉంచొద్దని సూచన
  • దెబ్బతిన్న కేబుల్స్, ఛార్జర్లను వాడొద్దన్న కంపెనీ
Never Sleep Next To Your Phone When It is Charging  Apple Warns Users

సెల్ ఫోన్‌కు సమీపంలో నిద్రించడం వల్ల కలిగే ప్రమాదాలు, లోపాలను ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా ఐఫోన్‌ల తయారీదారు ఆపిల్ కూడా స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు స్పష్టమైన సూచన చేసింది. ఫోన్ ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తులకు, ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పక్కనే పెట్టుకునే వారికి హెచ్చరిక జారీ చేసింది. దాన్ని తమ ఆన్‌లైన్ యూజర్ గైడ్‌లో చేర్చింది. ఈ నిబంధనల్లో ఐఫోన్లను బాగా వెలుతురు ఉన్న వాతావరణంలో, టేబుల్‌ల వంటి ఫ్లాట్ ఉపరితలాలపై పెట్టి ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. 

దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఛార్జింగ్ పెట్టవద్దని స్పష్టం చేసింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి.  ఈ వేడిని సులభంగా విడుదల చేయలేనప్పుడు ఫోన్ కొంద ఉన్న భాగం కాలిపోవడం, తీవ్రమైన సందర్భాల్లో మంటలను రేకెత్తించే ప్రమాదం కలిగిస్తాయని తెలిపింది. ఫోన్ ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఆ పరికరం, పవర్ అడాప్టర్, వైర్‌లెస్ ఛార్జర్‌పై నిద్రించవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచవద్దని స్పష్టం చేసింది. దెబ్బతిన్న కేబుల్స్, ఛార్జర్లను ఉపయోగించవద్దని, తేమ ఉన్నప్పుడు ఛార్జింగ్ చేయకూడదని కూడా సలహా ఇచ్చింది.

More Telugu News