Heath Streak: నేను బతికే ఉన్నా.. నాకు క్షమాపణలు చెప్పండి: హీత్ స్ట్రీక్

  • హీత్ స్ట్రీక్ చనిపోయాడంటూ ఉదయం నుంచి వార్తలు
  • తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానన్న స్ట్రీక్
  • తప్పుడు వార్తలతో హర్ట్ అయ్యానని వ్యాఖ్య
I am alive says Zimbabwe Cricket legend Heath Streak

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోయారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. స్ట్రీక్ మరణ వార్తతో క్రికెట్ ప్రేమికులు ఆవేదనకు గురయ్యారు. అయితే తాను బతికే ఉన్నానంటూ స్ట్రీక్ స్పందించారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. తాను చనిపోయాననేది పెద్ద రూమర్ అని అన్నారు. తాను బతికి ఉన్నానా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే ప్రచారం చేశారని విమర్శించారు. ఈ వార్తలతో తాను హర్ట్ అయ్యానని చెప్పారు. ఈ వార్తను ప్రచారం చేసిన వారు తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 49 ఏళ్ల హీత్ స్ట్రీక్ 31 ఏళ్ల వయసులో 2005లో క్రికెట్ కు వీడ్కోలు పలికారు. టెస్టుల్లో 100కు పైగా, వన్డేల్లో 200కు పైగా వికెట్లు పడగొట్టిన ఏకైన జింబాబ్వే బౌలర్ గా స్ట్రీక్ ఘనత సాధించాడు. 2000 సంవత్సరంలో ఆయన జింబాబ్వే జట్టుకు సారధ్యం వహించాడు.

More Telugu News