Chiranjeevi: నీ మాటలు నా హృదయాన్ని తాకాయి కల్యాణ్ బాబూ!: చిరంజీవి

Chiranjeevi replies to Pawan Kalyan wishes
  • ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు
  • ఒకరోజు ముందే శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • ముగ్ధుడైన చిరంజీవి
  • నా ప్రియాతి ప్రియమైన తమ్ముడికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) నేపథ్యంలో, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ ఒకరోజు ముందుగానే శుభాకాంక్షలు చెప్పడం తెలిసిందే. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే ఆ అదృష్టాన్ని కలిగించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. 

మీకు కోట్లాది మంది అభిమానులున్నా మీలో ఏ మాత్రం గర్వం లేదు... అందుకు కారణం మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానమే అంటూ అన్నయ్యను కీర్తించారు. మీ జీవన ప్రస్థానం చూస్తుంటే... ఒక సన్నని వాగు క్రమంగా ఎదుగుతూ మహానదిగా మారినట్టు అనిపిస్తుంది అని అభివర్ణించారు. 

కాగా, తన తమ్ముడు పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేయడంపై చిరంజీవి స్పందించారు. "నా ప్రియాతి ప్రియమైన తమ్ముడికి కృతజ్ఞతలు. నీ మాటలు నా హృదయాన్ని తాకాయి కల్యాణ్ బాబూ!" అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ట్విట్టర్ లో విపరీతమైన స్పందన లభిస్తోంది.
Chiranjeevi
Pawan Kalyan
Wishes
Birthday

More Telugu News