Venu Thottempudi: వేణు తొట్టెంపూడి హీరోగా హాట్ స్టార్ కి 'అతిథి' వెబ్ సిరీస్!

  • గతంలో హీరోగా మెప్పించిన వేణు తొట్టెంపూడి 
  • ఆ తరువాత వచ్చిన గ్యాప్ 
  • 'రామారావు ఆన్ డ్యూటీ'తో రీ ఎంట్రీ 
  • ఫస్టు టైమ్ చేసిన వెబ్ సిరీస్ గా 'అతిథి'
  • ఆసక్తిని పెంచుతున్న పోస్టర్  
Athidhi Web Series Update

హాట్ స్టార్ నుంచి ఈ మధ్యనే 'దయా' అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వెళ్లింది. జేడీ చక్రవర్తి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో పలకరించింది. ఒక లేడీ జర్నలిస్ట్ హత్య చుట్టూ అల్లుకున్న ఈ కథ ఆసక్తికరంగా నడుస్తుంది. ఇక ఇప్పుడు హాట్ స్టార్ నుంచి మరో వెబ్ సిరీస్ రానుంది .. ఆ సిరీస్ పేరే 'అతిథి'.

ఈ సిరీస్ లో వేణు తొట్టెంపూడి ప్రధానమైన పాత్రను పోషించాడు. ఆయనకి సంబంధించిన ఫస్టు పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. గాయపడిన హీరో .. శత్రువుల స్థావరంలో ఏం జరుగుతుందనేది రహస్యంగా గమనిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. వేణు చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. 

గతంలో వేణు హీరోగా విజయాలను అందుకున్నాడు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగాను చేశాడు. చాలా గ్యాప్ తీసుకున్న తరువాత ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్ తరువాత ఆయన ఆ దిశగా స్పీడ్ పెంచే అవకాశాలు లేకపోలేదు. త్వరలోనే ఈ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. 

More Telugu News