kethireddy pedda reddy: టీడీపీ కార్యకర్తలనే కేసుల్లో ఇరికిస్తున్నాడు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్

tadipatri mla peddareddy fires on jc prabhakar reddy
  • టీడీపీ నాయకులను బలి చేస్తున్నారన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • జేసీ కొడుకు హైదరాబాద్‌లో జల్సాలు చేస్తున్నారని ఆరోపణ
  • గొడవలకు స్థానిక నేతల కుటుంబాలను తాకట్టు పెడుతున్నాడని వ్యాఖ్య

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకార్తలు, నాయకులను కేసుల్లో ఇరికించి, బలి చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా యాడికిలో ప్రజా సంక్షేమ పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్‌‌రెడ్డిని చూసి టీడీపీ కార్యకర్తలు కొట్టుకోవద్దని సూచించారు.

కొడుకును ఎమ్మెల్యేను చేసేందుకు టీడీపీ నేతలను బలి చేస్తున్నారని ఆరోపించారు. 
టీడీపీ ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి.. హైదరాబాద్‌లో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై తాడిపత్రి తెలుగుదేశం నాయకులు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. 

‘‘ఎప్పుడు సమస్య వచ్చినా.. రేపో మాపో పాడి ఎక్కేవాడు వీడు చేస్తున్నాడు. అతడి కుమారుడిని మాత్రం హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చోబెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ నాయకులను బలి చేస్తున్నాడు. అతడి కొడుకు ఎమ్మెల్యే కావడానికి.. మీరు కావాలి.. మీ ఓట్లు కావాలి.. గొడవలకు మీ కుటుంబాలను తాకట్టు పెడుతున్నాడు” అని ఆరోపించారు.

  • Loading...

More Telugu News