Pavan Kalyan: 'OG' అంటే 'ఓజాస్ గంభీరా' .. పవన్ పాత్ర పేరు ఇదేనట!

  • పవన్ హీరోగా రూపొందుతున్న 'OG'
  • ఆయన పాత్ర పేరు 'ఓజాస్ గంభీరా' అంటూ టాక్ 
  • త్వరలో థాయ్ లాండ్ వెళ్లనున్న టీమ్ 
  • 200 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమా  

OG Movie Update

ఇటీవల 'బ్రో' సినిమాతో సందడి చేసిన పవన్ కల్యాణ్, ఆ తరువాత సినిమాగా 'OG' చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగులో పవన్ బిజీగా ఉన్నారు. డీవీవీ దానయ్య 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో పవన్ కనిపించనున్నారు. 

'సాహో' తరువాత దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి 'OG' అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచారు. దాదాపు ఈ టైటిల్ తోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి గనుక, ఇదే టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. 'OG' అంటే ఏంటి? అనే ఒక సందేహం చాలామందిలో ఉంది.

ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు 'ఓజాస్ గంభీరా' .. అందరూ కూడా 'OG' అని పిలుస్తూ ఉంటారట. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ అనుకున్నారని అంటున్నారు. త్వరలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం ఈ సినిమా టీమ్ 'థాయ్ లాండ్' వెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. 

More Telugu News