Mallu Bhatti Vikramarka: కేసీఆర్ ఇంత ముందుగా అభ్యర్థులను ఎందుకు ప్రకటించారంటే..!: మల్లు భట్టివిక్రమార్క

  • అభ్యర్థుల ప్రకటనపై కేసీఆర్ ముందే కూశారన్న కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత
  • ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే భయంతో ముందుగానే ప్రకటన అని వ్యాఖ్య
  • ఎవరైనా ఎన్నికల తేదీ ప్రకటించాక అభ్యర్థులను ప్రకటిస్తారన్న మల్లు భట్టి
  • గజ్వేల్‌లో ఓటమి భయంతో కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్న భట్టి
Mallu Bhatti on BRS first list

అభ్యర్థుల ప్రకటనపై సీఎం కేసీఆర్ ముందే కూశారని తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతో ముందుగానే అభ్యర్థుల జాబితాతో ప్రకటన చేశారన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గజ్వేల్‌లో ఓటమి భయంతోనే ఆయన కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్‌తోనే నెరవేరుతుందన్నారు. పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరిలోనే ప్రచారం ప్రారంభించినట్లు చెప్పారు.

ఎవరైనా ఎన్నికల తేదీలు ఖరారయ్యాక అభ్యర్థులను ప్రకటిస్తారని, కానీ ఎవరు చేజారిపోతోరో అనే భయంతో కేసీఆర్ ముందే ప్రకటించి, నేతలను కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో తాను ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గంలో అధికార పార్టీ విపరీతంగా నిధులు ఖర్చు చేసిందన్నారు. అయినప్పటికీ సర్వే నివేదికలు చూస్తే బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్‌కు అర్థమైందన్నారు. అందుకే ముందు జాగ్రత్త కోసం మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారన్నారు.

స్వయంగా కేసీఆర్ మరో నియోజకవర్గంలోనూ పోటీ చేస్తుండటంతో ఇక ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే అవకాశం లేదన్నారు. కేసీఆర్ నిత్యం సర్వేలు చేయిస్తుంటారని, గజ్వేల్‌లో ఓడిపోతుందని తేలడంతో కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిందని, పరిశీలన జరుగుతోందని, ఈ ప్రక్రియ తర్వాత సమయానుకూలంగా జాబితాను ప్రకటిస్తామన్నారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమన్నారు.

  • Loading...

More Telugu News