Margadarsi: కోర్టు ఆదేశాలతో మార్గదర్శి బ్రాంచి మేనేజర్ విడుదల

Police release Margadarsi branch manager after court denied for his remand
  • గతంలో మార్గదర్శి రాజమండ్రి బ్రాంచి మేనేజర్ అరెస్ట్
  • రిమాండ్ కు తిరస్కరించిన జిల్లా జడ్జి
  • గతంలోనూ ఇదే సెక్షన్ పై అరెస్ట్ చేశారని వెల్లడి
  • ఇప్పుడూ అవే సెక్షన్లు అంటే ఎలా అని ప్రశ్నించిన వైనం
  • గత కేసులో ఇప్పటివరకు చార్జిషీటు దాఖలు చేయలేదని వ్యాఖ్యలు

ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు ఆధ్వర్యంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు కోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆదేశాలో మార్గదర్శికి చెందిన ఓ బ్రాంచి మేనేజర్ ను పోలీసులు విడుదల చేశారు. రాజమండ్రి మార్గదర్శి బ్రాంచి మేనేజర్ రవిశంకర్ పై పెట్టిన కేసులో జిల్లా కోర్టు జడ్జి గంధం సునీత రిమాండ్ కు తిరస్కరించారు. 

గతంలోనూ ఇదే సెక్షన్ పై అరెస్ట్ చేశారని, నిందితుడి రిమాండ్ పూర్తయిందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గత కేసులో ఇప్పటివరకు చార్జిషీటు దాఖలు చేయలేదని తెలిపారు. ఇప్పుడు కూడా అవే సెక్షన్లతో కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. 

అటు, ఏపీ హైకోర్టు కూడా మార్గదర్శికి సాంత్వన కలిగే సూచన చేసింది. తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి బ్రాంచిల్లో సోదాలు చేయవద్దని ఏపీ సీఐడీకి స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News