Posani Krishna Murali: నా శవాన్ని కూడా వాళ్లకు చూపించొద్దని నా భార్యకు చెప్పా: పోసాని కృష్ణ మురళి

I told my wife not to show my dead body to industry people says Posani Krishna Murali
  • తన కుటుంబాన్ని ఆర్థికంగా సెటిల్ చేశానన్న పోసాని
  • భార్య పేరు మీద రూ. 50 కోట్ల ఆస్తి ఉందని వెల్లడి
  • తన చావుకు సానుభూతి చూపడం తనకు నచ్చదన్న పోసాని
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన మరణం గురించి మాట్లాడారు. తాను చనిపోతే ఏడవడం చేయవద్దని తన భార్యకు చెప్పానని ఆయన తెలిపారు. తన చావుపై తన భార్యను ముందే ప్రిపేర్ చేశానని చెప్పారు. తన కుటుంబాన్ని ఆర్థికంగా సెటిల్ చేశానని, తన భార్య పేరు మీద రూ. 50 కోట్ల ఆస్తి ఉందని తెలిపారు. తాను చనిపోయినా నీకు, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాదని, నెలకు రూ. 8 లక్షలు రెంట్ వచ్చేలా అంతా సెట్ చేశానని తన భార్యకు చెప్పానని తెలిపారు. తాను చనిపోయిన తర్వాత తన శవాన్ని ఇండస్ట్రీలో ఎవరికీ చూపించొద్దని చెప్పానన్నారు. తన చావుకు సానుభూతి చూపడం, ఏడవటం చేస్తే తనకు నచ్చదని తెలిపారు.
Posani Krishna Murali
Tollywood
YSRCP
Death

More Telugu News