Pawan Kalyan: ‘ఉస్తాద్‌’ పవన్ కల్యాణ్.. ఫొటో షేర్‌ చేసిన ఆనంద్ సాయి!

art director anandsai shares pawan kalyan photo in ustaad bhagat singh sets
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్‌లో పవన్‌ను కలిసిన ఆనంద్‌సాయి
  • ఇన్‌స్టాలో ఫొటో షేర్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ 
అటు రాజకీయాలతో.. ఇటు వరుస సినిమాలతో సూపర్‌‌ బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మరో మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పోలీసు పాత్రలో మరోసారి పవన్ కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ ఫొటోను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. వారిద్దరూ నడుచుకుంటూ వస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఇదిలా ఉంటే పవన్‌ కల్యాణ్, ఆనంద్ సాయి మొదటి నుంచీ మంచి స్నేహితులు. ఆనంద్‌ సాయి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ఒకసారి పరిశీలిస్తే.. ఎక్కువ ఫొటోలు పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఉన్నవే కనిపిస్తాయి. తరచూ పవన్‌తో దిగిన ఫొటోలను ఆనంద్‌ సాయి షేర్ చేస్తుంటారు. 

ఇక పవన్‌, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తొలిసారి వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సూపర్‌‌ హిట్ అయింది. దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత వారిద్దరి కలయికలో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది. మరోవైపు ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల్లోనూ పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.


Pawan Kalyan
anand sai
ustaad bhagat singh
Harish Shankar
Janasena

More Telugu News