Nandamuri: హైదరాబాదులో ఘనంగా నందమూరి హరికృష్ణ మనవడి వివాహం

  • ఈ ఏడాది మార్చిలో నందమూరి సుహాసిని తనయుడు హర్ష నిశ్చితార్థం
  • నేడు ఘనంగా వివాహం
  • హాజరైన చంద్రబాబు, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్, కల్యాణ్
Nandamuri Harikrishna grandson Harsha ties the knot

దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పెళ్లి వేదిక కళకళలాడింది. 

గచ్చిబౌలిలో ఈ వివాహ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు... తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి ఈ పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. వెంకట శ్రీహర్ష నిశ్చితార్థం ఈ ఏడాది మార్చిలో జరిగింది.

More Telugu News