Nara Lokesh: మా అంబాసిడర్ కారును ఆటోమేటిక్ కారుగా మార్చిన నైపుణ్యం ఇక్కడి ఆటోనగర్ కార్మికులది: నారా లోకేశ్

  • విజయవాడ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • ఆటోనగర్ కార్మికులు, రవాణా రంగ ప్రతినిధులతో సమావేశం
  • చైతన్యరథం తయారైంది ఇక్కడేనన్న లోకేశ్
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోనగర్ లను అభివృద్ధి చేసే బాధ్యత తాను స్వీకరిస్తానని వెల్లడి
Nara Lokesh held meeting with Auto Nagar workers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 189వ రోజు విజయవాడ, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర డీవీ మేనర్, లలితా జ్యుయెలర్స్, ఎన్టీఆర్ సర్కిల్, పటమట సెంటర్, ఆటోనగర్ గేట్, వంద అడుగుల రోడ్డు, పెనమలూరు నియోజకవర్గం సనత్ నగర్, తులసీ నగర్, కానూరు, కామయ్య తోపు, సిద్ధార్థ కాలేజి, పోరంకి మీదుగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని నిడమానూరు క్యాంప్ సైట్ కి చేరుకుంది. 

యువనేత వెంట తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు, గద్దే అనూరాధ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, పార్టీ నేతలు వంగవీటి రాధా, పెనమలూరు ఇన్ చార్జి బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవి రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. 

లోకేశ్ ఇవాళ ఏ-కన్వెన్షన్ సెంటర్ లో రవాణా రంగం ప్రతినిధులు, ఆటోనగర్ కార్మికులతో సమావేశమయ్యారు. 

లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

చైతన్యరథం తయారైంది ఇక్కడే!

ఆటోనగర్ కి గొప్ప చరిత్ర ఉంది. మేము అంబాసిడర్ కొన్నప్పుడు ఆటో నగర్ లోనే అప్ గ్రేడ్ చేయించాం. అంబాసిడర్ కారు ని ఆటోమేటిక్ కారు గా మార్చిన నైపుణ్యం ఆటోనగర్ కార్మికులది. ఆటోనగర్ లో ఎంతో మంది నైపుణ్యం ఉన్న కార్మికులు ఉన్నారు. చైతన్య రథం తయారు చేసిన ఆటో నగర్ ని నేను మర్చిపోను. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో నగర్ లను అభివృద్ది చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకు కావాల్సిన పాలసీలు ఇస్తాం. రిటర్న్ గిఫ్ట్ గా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించండి.

ఆటోనగర్ భూములు కొట్టేసేందుకు జగన్ అండ్ కో ప్లాన్!

ఆటో నగర్ లని ప్రైవేట్ పరం చేసి భూములు కొట్టేయాలని జగన్, వైసీపీ నాయకులు ఏకంగా జీవో తీసుకువచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో నగర్లు, ట్రాన్స్ పోర్ట్ రంగంపై ఆధారపడిన వారిని, కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కార్పొరేషన్లు బలోపేతం చేసి వాహనాలు కొనుగోలు చెయ్యడానికి సహకారం అందిస్తాం. 

జగన్ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రోడ్లు వేస్తాం. జగన్ పాలనలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. దీనివల్ల కూడా ట్రాన్స్ పోర్ట్ రంగంపై విపరీతమైన భారం పడుతుంది. కనీసం రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే దిక్కు లేదు. జగన్ ఐదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్లు అప్పు చెయ్యబోతున్నాడు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తాం. ఆటో నగర్ ల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తాం. అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. 

ఆటో నగర్ లలో సగం భూమి కొట్టేయాలని జగన్ తెచ్చిన జీవోలు మొత్తం రద్దు చేస్తాం. టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెకానిక్ లకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసేందుకు సహకారం అందిస్తాం. నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం

కరోనా సమయంలో పనులు లేక ఆటో నగర్ లో కార్మికులు, యజమానులు ఇబ్బంది పడ్డారు, జగనోరాలవల్ల ఆటోనగర్ లే మాయమయ్యే పరిస్థితి వచ్చింది. జగన్ ది దరిద్ర పాదం. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పన్నులు తగ్గించి ఇతర రాష్ట్రాలతో మన ట్రాన్స్ పోర్ట్ రంగం పోటీ పడే విధంగా చేస్తాం. అన్ని రాష్ట్రాల కంటే కనీసం రూపాయి తక్కువ పన్ను ఉండేలా చేస్తాం. ఆటో నగర్, ట్రాన్స్ పోర్ట్ రంగంపై ఆధారపడిన కార్మికులు ఇన్స్యూరెన్స్, ఆరోగ్య భద్రత కోసం చర్యలు తీసుకుంటాం.

జగన్ పాలనలో రవాణా రంగం కుదేల్!

కరోనా కంటే జగనోరా వైరస్ ప్రమాదకరం. కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది... జగనోరా వైరస్ కి కూడా త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది. జగన్ పాలనలో ట్రాన్స్ పోర్ట్ రంగం కుదేలు అయ్యింది. వివిధరకాల పేర్లతో పన్నులు విపరీతంగా పెంచేసి ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాడు. 

గ్రీన్ ట్యాక్స్, ఓవర్ హైట్, ఓవర్ లోడ్, క్వార్టర్లీ ట్యాక్స్ పేరుతో జగన్ ట్రాన్స్ పోర్ట్ రంగంపై ఆధారపడి ఉన్న వారిని వేధిస్తున్నాడు. జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ ఓటు... ఓటు హక్కు వినియోగించుకోండి. జగన్ పాలనలో పరిశ్రమలు అన్ని ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నాయి. పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తే రవాణా రంగం కూడా బాగుపడుతుంది.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2525.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16 కి.మీ.*

*190వరోజు (21-8-2023) యువగళం వివరాలు*

*గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి కృష్ణాజిల్లా)*

మధ్యాహ్నం 

2.00 – నిడమానూరు శివారు క్యాంప్ సైట్ లో బీసీలు, చేతివృత్తిదారులతో ముఖాముఖి.

3.00 – నిడమానూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

సాయంత్రం

4.00 – గూడవల్లి సెంటర్ లో రజక సామాజికవర్గీయులతో సమావేశం.

5.30 – కేసరపల్లిలో స్థానికులతో సమావేశం.

6.15 – గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద స్థానికులతో సమావేశం.

రాత్రి 

7.15 – గన్నవరం ఊరచెరువు వద్ద స్థానికులతో సమావేశం.

7.35 – గన్నవరం గాంధీబొమ్మ సెంటర్ లో లాయర్లతో సమావేశం.

9.05 – చిన్నఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ వద్ద విడిది కేంద్రంలో బస.

******

More Telugu News