Team India: ఐర్లాండ్ తో రెండో టీ20... టాస్ ఓడిన టీమిండియాకు మొదట బ్యాటింగ్

Ireland won the toss and opt to bowl first in 2nd T20I against Team India
  • నేడు టీమిండియా, ఐర్లాండ్ మధ్య రెండో టీ20
  • మొదటి మ్యాచ్ లో నెగ్గిన భారత్
  • నేటి మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ భారత్ కైవసం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్
టీమిండియా, ఐర్లాండ్ మధ్య నేడు రెండో టీ20 జరుగుతోంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది. 

తొలి మ్యాచ్ జరిగిన డబ్లిన్ లోనే నేటి మ్యాచ్ కూడా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో టీమిండియాకు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. 

ఈ సిరీస్ లో టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్ బుమ్రా టాస్ సందర్భంగా మాట్లాడుతూ, జట్టులో ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు. మొదటి మ్యాచ్ లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ లోనూ బరిలో దింపుతున్నామని వెల్లడించాడు. అటు, ఐరిష్ టీమ్ కూడా మార్పుల్లేకుండా బరిలో దిగుతున్నట్టు ఆ జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ పేర్కొన్నాడు.
Team India
Ireland
Toss
2nd T20I
Dublin

More Telugu News