New Delhi: 14 ఏళ్ల బాలికపై ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి పలుమార్లు అత్యాచారం

Delhi Officer Raped Friends Teen Daughter
  • గతేడాది తండ్రిని కోల్పోయిన బాలిక
  • ఇంటికి తీసుకొచ్చి అత్యాచారానికి పాల్పడిన నిందితుడు
  • గర్భం దాల్చడంతో మందులు తెప్పించి ఇంట్లోనే గర్భస్రావం చేయించిన నిందితుడి భార్య
ఢిల్లీ ప్రభుత్వంలోని సీనియర్ ఉద్యోగి ఒకరు తన స్నేహితురాలి 14 ఏళ్ల కుమార్తెపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కుమార్తెపై అఘాయిత్యానికి సహకరించిన మహిళపైనా కేసు నమోదైంది. 

బాధిత బాలిక గతేడాదే తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2020-2021 మధ్య పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అతడు తన భార్యకు చెప్పడంతో ఆమె తన కుమారుడితో మందులు తెప్పించి ఇంట్లోనే గర్భస్రావం చేయించినట్టు బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
New Delhi
Crime News
POCSO Act
Delhi Police

More Telugu News