Pawan Kalyan: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. ఎప్పటి నుంచంటే!

Pawan Kalyan Starrer Bro The Avatar Movie To Stream On Netflix OTT From August 25th
  • నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్
  • మేనల్లుడితో కలిసి పవన్ కల్యాణ్ నటించిన సినిమా
  • జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి హిట్ టాక్
మేనల్లుడితో పవన్ కల్యాణ్ కలిసి నటించిన కొత్త సినిమా ‘బ్రో’ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 25 నుంచి బ్రో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లను సాధించింది. 

బ్రో ఓటీటీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు సాయి ధరమ్ తేజ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రో.. ది అవతార్ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ తాజాగా అప్ డేట్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, తొలుత ఈ సినిమాను పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, వారం రోజుల ముందే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ తాజాగా ట్వీట్ చేసింది.
Pawan Kalyan
power star
BRO movie
OTT release
august 25
netflix

More Telugu News