AP NRTS: అమెరికా తిప్పి పంపేసిన విద్యార్థులకు అండగా ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్

  • విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ల ఏర్పాటు
  • సాయం కోసం తమను సంప్రదించాలన్న ఏపీ ఎన్ఆర్‌టీఎస్ అధ్యక్షుడు
  • మంచి ఏజెన్సీల ద్వారానే అమెరికా వెళ్లాలని విద్యార్థులకు సూచన
AP NRTS launches helpline numbers to help AP students deported from USA

ఇటీవల అమెరికా వెనక్కు పంపించేసిన విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏపీ ఎన్ఆర్‌టీఎస్ ముందుకొచ్చింది. అమెరికా ప్రభుత్వ బహిష్కరణకు గురైన విద్యార్థులు తమను సంప్రదించాలని ఏపీ ఎన్ఆర్‌టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి సూచించారు. 

భారత విద్యార్థులను అమెరికా ప్రభుత్వం ఎయిర్‌పోర్టుల నుంచే తిప్పి పంపించేస్తున్న అంశంపై సీఎం జగన్ దృష్టిసారించారని ఆయన చెప్పారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని భారత విదేశాంగ శాఖను సీఎం జగన్ కోరారని తెలిపారు. అంతేకాకుండా, అమెరికా వెళ్లే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ వద్ద కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని కూడా ఆయన విద్యార్థులకు సూచించారు. పేరున్న ఏజెన్సీల ద్వారానే అమెరికా వెళ్లడం మంచిదని చెప్పారు. విద్యార్థులు తమను 8632340678, 8500027628 హెల్ప్‌లైన్ నెంబర్లపై సంప్రదించవచ్చని, ఇవి 24 గంటలూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

More Telugu News