Dulquer Salmaan: రానా వ్యాఖ్యలపై మాట్లాడాలనుకోవడంలేదు: దుల్కర్ సల్మాన్

  • కింగ్ ఆఫ్ కోథా చిత్రంలో నటించిన దుల్కర్ సల్మాన్
  • ఇటీవల హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథులుగా రానా, నాని
  • బాలీవుడ్ లో ఓ హీరోయిన్ దుల్కర్ ను ఇబ్బంది పెట్టిందన్న రానా
  • ఆ హీరోయిన్ సోనమ్ కపూర్ అంటూ కథనాలు
  • క్షమాపణలు చెప్పిన రానా
Dulquer Salmaan opines on Rana comments

దక్షిణాది స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన కింగ్ ఆఫ్ కోథా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి రానా, నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

రానా మాట్లాడుతూ, బాలీవుడ్ లో ఓ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ ను ఇబ్బందిపెట్టిందని తెలిపారు. రానా ఈ వ్యాఖ్యలు చేసింది సోనమ్ కపూర్ ను ఉద్దేశించి అని ఆ తర్వాత కథనాలు వచ్చాయి. దాంతో రానా స్పందించి... దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ లకు క్షమాపణ చెప్పారు. తాను సరదాగా అన్న వ్యాఖ్యలతో వారిద్దరి గురించి వార్తలు రావడం తనను బాధించిందని, అందుకే క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. 

తాజాగా ఈ అంశంపై దుల్కర్ సల్మాన్ స్పందించారు. రానా చేసిన వ్యాఖ్యల పట్ల మాట్లాడాలనుకోవడంలేదని పేర్కొన్నారు. అవి రానా వ్యక్తిగత వ్యాఖ్యలు అని తెలిపారు. 

"వేదికపైకి వచ్చాక రానా నా గురించి మాట్లాడాలనుకుని ఆ విషయం చెప్పి ఉంటారని భావిస్తున్నా. అవి అప్పటికప్పుడు మాట్లాడిన మాటలే అయ్యుంటాయి. అందుకు ఆయన క్షమాపణ కూడా చెప్పారు. టాలీవుడ్ లో నాకు మంచి స్నేహితులు ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నేను దేనిపైనా ఫిర్యాదు చేయాలనుకునే వ్యక్తిని కాను. నా పని నేను చేసుకుంటూ వెళ్లడమే నాకిష్టం" అని వివరించారు.

More Telugu News