earth quake: మణుగూరులో స్వల్ప భూప్రకంపనలు

- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపించిన భూమి
- శనివారం సాయంత్రం 2 సెకన్ల పాటు ప్రకంపనలు
- భయాందోళనలకు గురైన ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరులో శనివారం సాయంత్రం దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.