KTR: ఆశించిన వారందరికీ టిక్కెట్ ఇవ్వలేం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BRS working president KTR on mla ticket
  • నియోజకవర్గానికి ఒకటే టిక్కెట్, ఒకటే బీఫామ్ ఉంటుందని వ్యాఖ్య
  • పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే కలిసికట్టుగా గెలిపించాలని సూచన
  • టిక్కెట్ ఆశలు, నేతల మధ్య విభేదాలు పక్కన పెట్టాలని హితవు
ఆశించిన వారందరికీ టిక్కెట్ ఇవ్వలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నియోజకవర్గానికి ఒకటే టిక్కెట్, ఒకటే బీఫామ్ ఉంటుందన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ... పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అందరూ కలిసికట్టుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిక్కెట్ ఆశలు, నేతల మధ్య విభేదాలు అన్నీ పక్కన పెట్టి, అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకోవాలన్నారు. అందరం కలిసి కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
KTR
BRS
Telangana Assembly Election

More Telugu News