Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో లోకేశ్ ను కలిసిన వంగవీటి రాధా... నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలు

Vangaveeti Radha met Nara Lokesh in Vijayawada
Advertisement
  • మంగళగిరి నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ యువగళం
  • నేటి సాయంత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశం
  • విజయవాడలో లోకేశ్ కు ఘనస్వాగతం
  • విజయవాడలో లోకేశ్ తో కలిసి పాదయాత్రలో నడిచిన వంగవీటి రాధా
  • మిన్నంటిన జై లోకేశ్, జై రాధా నినాదాలు
Advertisement
విజయవాడలో ఈ సాయంత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించగా... టీడీపీ యువనేత నారా లోకేశ్ ను వంగవీటి రాధా కలిశారు. వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

వంగవీటి రాధా... పాదయాత్రలో లోకేశ్ తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా నినాదాలు మిన్నంటాయి. "జై లోకేశ్, జై రాధా" అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. 

లోకేశ్ యువగళం పాదయాత్ర ఇవాళ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. లోకేశ్ రాకతో విజయవాడ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.
Advertisement
Advertisement
Vangaveeti Radha
Nara Lokesh
Vijayawada
Yuva Galam Padayatra
TDP

More Telugu News