Vellampalli Srinivasa Rao: తప్పయిందని చెప్పాకే లోకేశ్ విజయవాడకు రావాలి: మాజీ మంత్రి వెల్లంపల్లి

Vellampalli Srinivas demands apology from Nara Lokesh
  • పాదయాత్రను అడ్డుకుంటే ఇన్నిరోజులు కొనసాగించేవాడా? అని ప్రశ్న
  • చంద్రబాబు, లోకేశ్ ఉన్నప్పుడు విజయవాడకు ఏం చేశారని నిలదీత
  • మా హయాంలో నగరానికి ఏం చేయలేకపోయామని చెప్పి అడుగుపెట్టాలి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే ఇన్ని రోజులు యాత్రను కొనసాగించేవాడా? అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. అసలు ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో తెలుసా? అని నిలదీశారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌ను పూర్తి చేసింది వైసీపీయే అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... లోకేశ్‌కు విజయవాడలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు, మంత్రిగా లోకేశ్ విజయవాడకు ఏం చేశారన్నారు.

విజయవాడలో అడుగుపెట్టే ముందు మా హయాంలో విజయవాడను నిర్లక్ష్యం చేశాం.. తప్పయిపోయిందని చెప్పిన తర్వాత రావాలన్నారు. కృష్ణ వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల కోసం చంద్రబాబు రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేకపోయాడో చెప్పాలన్నారు. విజయవాడ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి జగన్ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జగన్ పాలనలో స్వచ్ఛ సురక్షలో విజయవాడ నగరానికి మూడో ర్యాంకు వచ్చిందని గుర్తు చేశారు.
Vellampalli Srinivasa Rao
YS Jagan
Nara Lokesh
Vijayawada

More Telugu News