jyothi surekha: ఎదురులేని తెలుగు బాణం.. జ్యోతి సురేఖకు మరో స్వర్ణం

  • ఆర్చరీ ప్రపంచ కప్‌లో మెరిసిన తెలుగు తేజం
  • మహిళల కాంపౌండ్ జట్టు తరఫున స్వర్ణం నెగ్గిన సురేఖ
  • రెండు వారాల కిందట వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఇదే జట్టు
India win gold medal in Compound Women Team event of Archery World Cup Stage 4

భారత ఆర్చరీ అగ్ర క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ తన గురితో మరోసారి సత్తా చాటింది. రెండువారాల కిందట ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు తొలి స్వర్ణ పతకం అందించి చరిత్ర సృష్టించిన సురేఖ తాజాగా మరో బంగారు పతకం సొంతం చేసుకుంది. పారిస్ లో జరుగుతున్న ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్4 టోర్నమెంట్ లో భారత మహిళల కాంపౌండ్ జట్టు తరఫున స్వర్ణం గెలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి, పర్నీత్ లతో కూడిన జట్టు 234–233 స్కోరుతో ప్రపంచ అగ్ర ర్యాంకర్ మెక్సికోను ఓడించి చాంపియన్‌ గా నిలిచింది. ఇదే జట్టు ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్‌ లో స్వర్ణం నెగ్గింది.

More Telugu News