భాగ్యనగరంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. ఒక్క రోజులో టికెట్ల ఖాళీ

WWE tickets sell like hot cakes in Hyderabad
  • సెప్టెంబర్ 9న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కుస్తీ పోటీలు
  • బుక్ మై షో వేదికపై టికెట్ల అమ్మకాలు
  • హైఎండ్ టికెట్లన్నీ ఖాళీ
అదొక రెజ్లింగ్ ఈవెంట్. అంటే కుస్తీ పోటీలు. వీటి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సాదా సీదా కుస్తీ పోటీలు అనుకోవద్దు. ప్రపంచంలోనే ఎంతో పాప్యులర్ అయిన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) మొదటిసారి హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ పోటీలకు సంబంధించిన టికెట్లను బుక్ మై షో అందుబాటులోకి తీసుకురాగా, ఒక్క రోజులోనే అన్నీ అయిపోయాయి.

హైదరాబాదీల నుంచి వచ్చిన స్పందన చూసి బుక్ మై షో నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. రూ.12,000, రూ.15,000 ధరల టికెట్లన్నీ అయిపోగా.. రూ.5,000, రూ.7,500 టికెట్ కేటగిరీల్లో బుకింగ్ లు ముగింపునకు వచ్చేశాయి. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 8న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

మొదటి లైవ్ డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమం హైదరాబాద్ నుంచి జరుగుతున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియప్ రియా రిప్లే, సమీ జ్యాయన్, కెవిన్ఓనర్ తదితర రెజ్లింగ్ స్టార్లు రాబోతున్నారు బుక్ మై షో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తోంది.
Go Back to Shorts
WWE event
Hyderabad
book my show
tickets
sold

More Telugu News