Aadikeshava: మెగా హీరో చిత్రం విడుదల వాయిదా.. కారణం ఏంటంటే..!

Aadikeshava will arrive in theaters from November 10
  • వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఆదికేశవ
  • శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా
  • నవంబర్ 10న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటన
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, యువనటి శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తవకపోవడంతో విడుదల వాయిదా పడింది. చిత్రాన్ని నవంబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను షేర్ చేసింది. ఇటీవలే ప్యారిస్‌ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా కొంత భాగం చిత్రీకరణ మిగిలింది. దాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ రుద్ర కాళేశ్వర్ రెడ్డి పాత్రలో మాస్ లుక్‌లో కనిపించనున్నాడు.  మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Aadikeshava
Panja Vaisshnav Tej
srileela
postpone

More Telugu News