Supreme Court: 16-18 ఏళ్ల వారిమధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారంపై మీ అభిప్రాయం ఏమిటి?: కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న

Supreme Court seeks Centres reply on decriminalising consensual sex between adolescents
  • చట్టం పరిధిలో నేరంగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ పిల్
  • దీనిపై కేంద్ర న్యాయ, హోంశాఖ లకు నోటీసుల జారీ
  • తమ ఇష్ట ప్రకారం వ్యవహరించే స్వేచ్ఛ ఉండాలన్న వాదన
పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని చట్ట ప్రకారం నేరంగా పరిగణించరాదని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. 16-18 ఏళ్ల వయసులోని వారికి సంబంధించి దాఖలైన ఈ వ్యాజ్యంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుంప్రీకోర్టు ఆదేశించింది. న్యాయవాది హర్ష విబోర్ సింఘాల్ ఈ పిల్ దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా విచారించారు. 

స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ, హోంశాఖ, జాతీయ మహిళా కమిషన్ లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 16-18 ఏళ్ల వయసులోని వారి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని అత్యాచార నిరోధక చట్టాల కింద నేరంగా పరిగణించడాన్ని ఈ పిల్ సవాల్ చేసింది. కౌమార దశలోని వారు శారీరక, జీవ, భౌతిక పరమైన అవసరాలు, సమాచారాన్ని విశ్లేషించుకోగలరని.. నిర్భయంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా వారు తమ శరీరాలతో చేయాలనుకున్నది చేసుకోగలిగే అవకాశం ఉండాలని పిటిషనర్ కోరారు.
Supreme Court
decriminalising
consensual sex
adolescents
notices

More Telugu News