అల్లు అర్జున్ నా తరపున ప్రచారం చేస్తాడు.. పొలిటికల్ గా బన్నీ సేవలు అవసరం: మామ చంద్రశేఖర్ రెడ్డి
- గత ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన చంద్రశేఖర్ రెడ్డి
- అవకాశం వస్తే ఈసారి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయబోతున్నట్టు వెల్లడి
- రాజకీయంగా బన్నీ సేవలు అవసరమని వ్యాఖ్య
అందరు మామాఅల్లుళ్లు ఎలా ఉంటారో... తనతో కూడా అల్లు అర్జున్ అలానే ఉంటారని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. తమతో ఎంతో ఆప్యాయంగా ఉంటారని తెలిపారు. మరోవైపు, సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం భట్టుగూడెం వద్ద చంద్రశేఖర్ రెడ్డి ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ఈరోజు ఈ ఫంక్షన్ హాల్ ను అల్లు అర్జున్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బన్నీ అభిమానుల సందడి నెలకొంది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు కూడా రానున్నారు. ఆ ప్రాంతంలో కేటీఆర్, జగదీశ్ రెడ్డి కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు.