Budda Venkanna: లోకేశ్ వెళ్లిపోయేంత వరకు ఎవరైనా ఫ్లెక్సీ, బ్యానర్ మీద చేయి వేస్తే వారి సంగతి చూస్తాం: బుద్దా వెంకన్న

Budda Venkanna warns YSRCP leaders over TDP flexes
  • నేడు కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతున్న లోకేశ్ పాదయాత్ర
  • పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేసిన టీడీపీ శ్రేణులు
  • అధికారులు ఫ్లెక్సీలను తొలగిస్తుండటంపై బుద్దా వెంకన్న ఆగ్రహం
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈరోజు గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. ఉండవల్లిలోని తన తండ్రి చంద్రబాబు నివాసం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్ యాత్ర మొదలవుతుంది. ఈ నేపథ్యంలో లోకేశ్ కు స్వాగతం పలుకుతూ టీడీపీ నేతలు భారీ ఎత్తున ఫ్లెక్సీలను, బ్యానర్లను, హోర్డింగులను ఏర్పాటు చేశారు. అయితే వాటిని మున్సిపల్ సిబ్బంది, పోలీసులు తొలగిస్తున్నారు. 

దీనిపై బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల సూచనల మేరకు అధికారులు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. తాము ఏ అధికారికి ఫోన్ చేసినా ఎత్తడం లేదని చెప్పారు. ఫ్లెక్సీల మీద ఏ ఒక్క వైసీపీ నాయకుడు చేయి వేసినా వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. లోకేశ్ వెళ్లేంత వరకు ఫ్లెక్సీలు ఉండాల్సిందేనని, ఎవరైనా తొలగించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు.
Budda Venkanna
Nara Lokesh
Telugudesam
Yuva Galam Padayatra

More Telugu News