Kishan Reddy: దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారు: కిషన్ రెడ్డి

  • దళితబంధు బీఆర్ఎస్ బంధుగా మారిందన్న కిషన్ రెడ్డి
  • కేసీఆర్ కుటుంబం పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని వ్యాఖ్య
  • ఖమ్మం సభకు అమిత్ షా వచ్చే అవకాశం ఉందని వెల్లడి
BRS MLAs taking commissions in Dalit Bandhu says Kishan Reddy

తెలంగాణలో దళితబంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాకర్టీ కడతామని కేసీఆర్ కుటుంబసభ్యులు ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని... మీ కుటుంబం కోసం మాత్రమేనని మండిపడ్డారు. 

పోలీసు అధికారులు వారి కనుసన్నల్లో పని చేసేలా కేసీఆర్ కుటుంబం చేసుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన అజయ్ ఇంత సంపదను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలను కూడా అజయ్ వేధిస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని అన్నారు.

More Telugu News