Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావం
  • 202 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 55 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నప్పటికీ... ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంలో చివరకు నష్టాలు తప్పలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 64,948కి పడిపోయింది. నిఫ్టీ 55 పాయింట్లు కోల్పోయి 19,310 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (0.75%), మారుతి (0.71%), నెస్లే ఇండియా (0.67%), యాక్సిస్ బ్యాంక్ (0.67%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.53%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.14%), టెక్ మహీంద్రా (-1.80%), ఇన్ఫోసిస్ (-1.59%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.50%), సన్ ఫార్మా (-1.35%).

More Telugu News