Britney Spears: బ్రిట్నీ స్పియర్స్ తో విడిపోతున్నది నిజమే: శామ్ అస్ఘారి

Sam Asghari confirms separation rumours with Britney Spears Read statement

  • ఆరేళ్ల తమ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటన
  • తమ మధ్య ప్రేమ, గౌరవం కొనసాగుతాయన్న అస్ఘారి
  • చక్కదిద్దుకోలేని విభేదాలు ఏర్పడ్డాయంటూ పిటిషన్

ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్, ప్రముఖ నటుడు శామ్ అస్ఘారి విడిపోతున్నారంటూ వస్తున్న ప్రచారానికి ముగింపు కార్డు పడింది. స్వయంగా శామ్ అస్ఘారి దీనిపై స్పష్టత నిచ్చాడు. తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు అస్ఘారి ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించాడు. విడాకుల కోసం వీరు లాస్ ఏంజెలెస్ కంట్రీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చక్కదిద్దుకోలేనంతగా తమ మధ్య విభేదాలు వచ్చాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో పెళ్లయిన ఏడాదికే వీరి బంధం విచ్ఛిన్నం కాబోతోంది.

2022 జూన్ లో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ‘‘ఆరేళ్ల పాటు ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, అంకిత భావం అనంతరం.. మా ప్రయాణానికి ముగింపు పలకాలని నేను, నా భార్య నిర్ణయించుకున్నాం. మా మధ్య ప్రేమ, గౌరవం కొనసాగుతాయి. ఆమెకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. గోప్యత పాటించాలని అడగడం హాస్యాస్పదంగా అనిపించొచ్చు. కనుక ప్రతి ఒక్కరూ, మీడియా దయతో వ్యవహరించాలని కోరుతున్నాను’’అని శామ్ అస్ఘారి ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించాడు.

Britney Spears
Sam Asghari
seperation
confirmed
  • Loading...

More Telugu News