YV Subba Reddy: పవన్ కల్యాణ్‌కు వైవీ సుబ్బారెడ్డి సవాల్

YV Subbareddy challenges Pawan Kalyan on rushikonda
  • రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలపై పవన్ చర్చకు రావాలన్న వైవీ సుబ్బారెడ్డి
  • టీడీపీ హయాంలోనే ఎర్రమట్టి దిబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ జరిగిందని వ్యాఖ్య
  • రిషికొండపై అక్రమ నిర్మాణాలుంటే సుప్రీంకోర్టు వదిలేస్తుందా? అని ప్రశ్న
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన విమర్శలపై మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలోనే ఎర్రమట్టి దిబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ జరిగిందని చెప్పారు. రిషికొండపై అక్రమ నిర్మాణాలు ఉంటే.. సుప్రీంకోర్టు వదిలేస్తుందా? అని ప్రశ్నించారు.

గీతం యూనివర్సిటీ ఆక్రమణలు పవన్‌ కల్యాణ్‌కు కనపడవా? అని నిలదీశారు. పవన్ ఎన్ని పర్యటనలు చేసినా రాష్ట్రంలో మళ్లీ వైసీపీదే అధికారమని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దయ్యే ప్రమాదం ఉందని అన్నారు. పథకాలు ప్రజలకు అందాలంటే జగనన్న రావాలని చెప్పారు.
YV Subba Reddy
Pawan Kalyan
rushikonda
Chandrababu
YSRCP
Janasena
Telugudesam

More Telugu News