Ambati Rambabu: చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లపై అంబటి రాంబాబు సెటైర్లు

Minister Ambati Rambabu satires on Chandrababu and Lokesh and Pawan Kalyan
  • ప్రతిపక్షాల పర్యటనలను ఉద్దేశిస్తూ అంబటి రాంబాబు విమర్శలు
  • బాబు బస్సు ఎక్కారని, దత్తపుత్రుడు లారీ ఎక్కారని వ్యాఖ్యలు
  • వాళ్లు గద్దెనెక్కడం మాత్రం అసాధ్యమని ట్వీట్
ప్రతిపక్షాలపై సెటైర్లతో విరుచుకుపడే ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. ట్విట్టర్‌‌ వేదికగా మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ముగ్గురూ ఏం చేసినా గద్దెనెక్కడం అసాధ్యమని చెప్పుకొచ్చారు. ‘‘బాబు గారు బస్సు ఎక్కాడు..  పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు.. దత్తపుత్రుడు లారీ ఎక్కాడు.. కానీ గద్దెనెక్కడం అసాధ్యం!” అని ట్వీట్ చేశారు. దీనికి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను ట్యాగ్ చేశారు.

వారాహి యాత్ర పేరుతో రాష్ట్రంలో పవన్‌ కల్యాణ్ పర్యటనలు చేస్తుండగా.. నారా లోకేశ్ కొన్ని నెలలుగా యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరోవైపు కోనసీమ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. వీటిని ఉద్దేశిస్తూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
Ambati Rambabu
Chandrababu
Pawan Kalyan
Nara Lokesh

More Telugu News