Nitish Kumar: అవసరమైతే ఫోన్లో మాట్లాడుకుంటాం: ఢిల్లీలో ఎవర్నీ కలవకపోవడంపై నితీశ్ కుమార్

Present NDA does not have any vision says Nitish Kumar

  • వాజపేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్లానన్న బీహార్ సీఎం
  • ఢిల్లీలో కొద్దిసేపే ఉన్నా కాబట్టి వారిని కలవలేదని వెల్లడి
  • ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఎలాంటి విజన్ లేదన్న నితీశ్ కుమార్

ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎలాంటి విజన్ లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోపించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన నివాళులర్పించి, తిరిగి గురువారం పాట్నాకు వచ్చారు. తాను వాజపేయి కేబినెట్లో పని చేశానని గుర్తు చేసుకున్నారు. తాను ఢిల్లీలో I.N.D.I.A. కూటమి నేతలతో ఏమీ మాట్లాడకుండానే వచ్చాననే విమర్శలపై స్పందిస్తూ.. కొద్దిసేపు మాత్రమే తాను ఢిల్లీలో ఉన్నానని, వాజపేయికి నివాళులు అర్పించేందుకే అక్కడికి వెళ్లానని చెప్పారు.

1999లో ఎన్డీయే ప్రారంభమైందని, అప్పుడు కూటమి సమావేశాలు తరచూ జరిగేవని, కానీ ఇప్పుడు మాత్రం I.N.D.I.A. ప్రకటన తర్వాత జరుగుతున్నాయని విమర్శించారు. తాను ఢిల్లీలో ఎక్కువ సమయం లేనని, అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను కలవలేదన్నారు. అవసరమైతే ఫోన్‌లో మాట్లాడుకుంటామని చెప్పారు. తదుపరి I.N.D.I.A. సమావేశం అగస్ట్ 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరుగుతోందన్నారు.

Nitish Kumar
NDA
BJP
India
  • Loading...

More Telugu News